యానిమల్ మూవీ కొత్త రికార్డు

ENTERTAINMENT Star Maa News

సంచలన దర్శకుడు వంగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా వసూళ్లలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా కూడా సెలవు లేని రోజు ఇంత భారీ మొత్తం వసూళ్లు సాధించలేదు అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉండగా..సెకండ్ హాఫ్ మాత్రం స్లో అవుతుంది. పెద్దలకు మాత్రమే పరిమితం అయిన ఈ సినిమా రానున్న రోజుల్లో వసూళ్ల పరంగా కొత్త కొత్త రికార్డు లు క్రియేట్ చేయటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. తెలుగు లో కూడా యానిమల్ సినిమా ఫుల్ జోష్ తో సాగుతోంది. రెండవ రోజు కూడా థియేటర్లు అన్నీ ఫుల్ గా ఉన్నాయి.

Spread the love