కేసీఆర్ మీద సెటైర్లు వేసిన బర్రెలక్క.. గజగజ వణికిపోతున్నారంటూ కామెంట్స్

POLITICAL TELANGANA

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిరుద్యోగ యువతి బర్రెలక్క పేరే వినిపిస్తోంది. ఒక్క వీడియోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ఏకంగా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసి పోటీ చేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. బర్రెలక్క తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజలతో పాటు పలువురి ప్రముఖుల ఆదరణ పొందుతుంది. దీంతో ఆమె ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి విజిల్ గుర్తుకి ఓటు వేయాలని వేడుకుంటోంది. ఈ క్రమంలో బర్రెలక్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను నామినేషన్ వేసి వచ్చినప్పటినుంచి చాలా భయపడ్డాను. నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. మనలాంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే ఇలా భయ పెట్టిస్తారా. ఇన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే నేను గెలుస్తానని వాళ్ల భయం. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మన జీవితాల్ని నాశనం చేయబోతుందని వాళ్లకు భయమేస్తుంది.

నేను చాలా నిరుపేదరాలిని, నామినేషన్ వేయడానికి కొంత అప్పు తీసుకొచ్చి వేసాను. ఎందుకంటే పేద అమ్మాయిని మీరంతా ఆదరిస్తారని నమ్మకం. ఓటుకి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు కానీ నేను గెలిస్తే మీకు అన్ని పనులు చేసి పెడతాను. మీరు విజిల్ గుర్తుకు ఓటెయ్యండి చాలు అభివృద్ధి ఎందుకు రాదో నేను చూస్తాను. నేనే కాదు మిమ్మల్ని అందరినీ అసెంబ్లీకి తీసుకొని వెళతాను. మనకు కావాల్సినవి మనం తెచ్చుకుందాం. ఇక్కడ విద్య, వైద్యం, రోడ్లు సరిగా లేవు. నేను గెలిస్తే ఇవన్నీ చేస్తాను. నేను తాత కేసీఆర్‌తో పోరాడాలంటే మీరు నన్ను గెలిపియ్యాలి. ఈ రోడ్లు సరిగ్గా లేవు. మీరు ఎవరిని అడగలేదా.. మీరు దేనికి భయపడొద్దు. 25 సంవత్సరాల అమ్మాయి నైన నేను 70 ఏళ్ల వారిని గడగడ వణికిస్తున్నా. ఆమె గెలిచేటట్టు ఉందని అందుకే మా తమ్ముడి మీద దాడి చేశారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ధైర్యంగా ముందుకు సాగుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది.

Spread the love