ప్రచారానికి బ్రేక్.. ఓటర్లకు సీఎం ఫోన్ కాల్

POLITICAL TELANGANA

తెలంగాణలో మరికొన్ని నిమిషాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ వచ్చాయి. తమ పార్టీకి ఓట్లు వేయాలని క్యాండిడేట్లు కాల్స్ ద్వారా ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించేందుకు ఈవీఎంలో కారు గుర్తు ఉండే నంబర్‌పై ఓటెయ్యాలని అవగాహన కల్పించారు. ‘హలో నేను కేసీఆర్ ను మాట్లాడుతున్నా’ అంటూ ఒక్కసారిగా సీఎం నుంచి ఊవీఆర్‌ఎస్ కాల్ రావడంతో ప్రజలు షాక్ అవుతున్నారు.

Spread the love