సలార్ మూవీ ఎన్ని గంటలో తెలుసా?!

Star Maa News ENTERTAINMENT

ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నిడివి రెండు గంటల ఏభై ఐదు నిముషాలు. అంటే దగ్గర దగ్గర మూడు గంటలు అన్న మాట. సలార్ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నా తొలి పార్ట్ ఏకంగా మూడు గంటల నిడివి ఉండటం విశేషం. ఏ సర్టిఫికెట్ రావటానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న తీవ్రమైన రక్తపాత సన్నివేశాలు..ఎంతో తీవ్రతతో కూడిన పోరాట ఘట్టాలే అని చెప్పొచ్చు.

సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ ఇదే కావటంతో ఫాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తుంటే..ఇతర కీలక పాత్రల్లో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. పెద్ద హీరో లకు చెందిన సినిమాల నిడివి ఎంత ఉన్నా ఇబ్బంది ఉండదు అని…అయితే సినిమా మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉండటం ఎంతో ముఖ్యం అని చెపుతున్నారు. ఇటీవల విడుదల అయిన యానిమల్ మూవీ నిడివి మూడు గంటలు ఉన్నా ప్రేక్షకులు పెద్దగా ఎక్కడ బోర్ ఫీల్ కాలేదు.

Spread the love