మహిళ ఆత్మహత్య కేసు లో

Star Maa News ENTERTAINMENT

జగదీశ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు కానీ..పుష్ప సినిమాలో కేశవ పాత్ర గురించి చెపితే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. అసలు పేరు జగదీష్ అయినా కూడా కేశవ పాత్రతోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాతో అంతగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ నటుడు. అయితే ఇప్పుడు ఇదే కేశవ అంటే జగదీశ్ ఒక మహిళ ఆత్మహత్య కేసు లో అరెస్ట్ కావటం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. జగదీష్ ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్న సమయంలో వాళ్లకు తెలియకుండా ఫోటో లు తీసి ..వాటిని సోషల్ మీడియా లో పెడతానని బెదిరించాడు. జగదీశ్ బెరింపులతో ఆ మహిళ గత నెలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అప్పటి నుంచి జగదీష్ కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆ మహిళ తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ లు బండారు జగదీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళ కూడా సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ఆమె కావటంతో జగదీష్ కు గతంలో ఆమెతో పరిచయం ఉంది అని చెపుతున్నారు. పుష్ప సినిమా లో కేశవ పాత్ర చేసినప్పటినుంచి జగదీష్ కు సినిమాల్లో వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఒక మహిళ ఆత్మహత్య కేసు లో అరెస్ట్ కావటం సంచలనంగా మారింది.

Spread the love