టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో కూడా మంచి క్రేజ్

ENTERTAINMENT

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ యాక్టర్స్ కూడా మహేష్ బాబుకు అభిమానులుగా ఉన్నారు. ఇక ఆయనను ఎంతగానో అభిమానించే వారిలో అనిల్ కపూర్ కూడా ఉన్నట్లు ఇటీవల అనిమల్ ఈవెంట్ తో క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది. యానిమాల్ సినిమా ఈవెంట్ కు చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకకు వచ్చిన రెస్పాన్స్ ను చూసి రణబీర్ కపూర్ తో పాటు అనిల్ కపూర్ అలాగే రాజమౌళి కూడా షాక్ అయ్యాడు. వేడుకలో ఆ రెస్పాన్స్ చూసి సోషల్ మీడియాలో కూడా రియాక్ట్ అయ్యారు.

ఇక అనిల్ కపూర్ మరోసారి మహేష్ బాబు స్టార్ ఇమేజ్ గురించి చాలా గొప్పగా మాట్లాడిన విధానం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ముందుగా హైదరాబాద్ వాసులు మాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయత, దాతృత్వం కంటే మా సినిమాకు మంచి ఆశీర్వాదం వస్తుందని నేను ఊహించలేకపోయాను… ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించినందుకు మహేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

అతని స్టార్ హోదా చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతోంది.. ఈవెంట్ లో అతనే హైలెట్ అయ్యాడు. నన్ను అపురూపమైన టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసినందుకు మరియు నా మొట్టమొదటి తెలుగు సినిమాకి దర్శకత్వం వహించినందుకు దివంగత బాపు సాబ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్‌తో నా బంధం యానిమాల్ సినిమాతో మరింత ఎక్కువగా పెరుగుతుందని ఆశిస్తున్నాను.. అని అనిల్ కపూర్ తెలియజేశారు.

ఇక అనిల్ కపూర్ ఆ విధంగా వివరణ ఇవ్వడంతో మహేష్ ఫాన్స్ కూడా అతని మాటలకు ఫిదా అవుతున్నారు. మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరిన్ని పాత్రలు చేయాలి అని పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇక అనిల్ కపూర్ యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ కు తండ్రి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. డిఫరెంట్ తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ తో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

Spread the love