పరువు నష్టం దావా వేయనున్న పల్లవి ప్రశాంత్.

ENTERTAINMENT CRIME Star Maa News TELANGANA

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. కాగా తన ఇమేజ్ దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేసిన వాళ్లపై పల్లవి ప్రశాంత్ చర్యలకు సిద్ధం అవుతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. డిసెంబర్ 17న సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. అమర్ దీప్ ఫ్యాన్స్ తో వాళ్లకు గొడవలు అయ్యాయి.

పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ ధ్వంసం అయ్యింది. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా ఫ్యాన్స్ తో ర్యాలీ నిర్వహించిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు.

కాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా అతడి ఇంటర్వ్యూల కోసం పలు యూట్యూబ్ ఛానల్స్ స్వగ్రామానికి పోయాయి. అయితే పల్లవి ప్రశాంత్ ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మీరు రైతులకు ఏం చేస్తారో చెప్పండని అన్నాడు.

ఇంటర్వ్యూ ఇవ్వలేదని పల్లవి ప్రశాంత్ పై పలు ఛానల్స్ నెగిటివ్ పబ్లిసిటీ చేశాయి. ముఖ్యంగా యాంకర్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ శివ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టాడు. వరస్ట్ బిహేవియర్. ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్లేదు. చెప్పిన విధానం దారుణంగా ఉంది. దీనిపై ఒక వీడియో చేస్తాను, అని పోస్ట్ పెట్టాడు.

తాను మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో తర్వాత పల్లవి ప్రశాంత్ చెప్పాడు. నేను బాగా అలసిపోయి ఉన్నాను. అన్నం కూడా తినలేదు. నీరసంగా ఉంది. ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పాను. దానికే తప్పుడు ప్రచారం చేశారని వాపోయాడు.

కాగా జైలు నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేయాలి అనుకుంటున్నాడట. ఏకంగా 50 మంది లాయర్లు రంగంలోకి దిగారట. యూట్యూబ్ యాంకర్ శివతో పాటు పలు ఛానల్స్ పై ఆయన కేసులు పెట్టనున్నాడని సోషల్ మీడియా టాక్.

ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ షోతో వచ్చిన డబ్బులు పేద రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. దానికి ఏర్పాట్లు జరగనున్నాయట.

Spread the love