యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్ దూరం

ANDHRA PRADESH POLITICAL Star Maa News

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..యువగళం (Yuvagalam) ముగింపు సభకు రావడం లేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలకు తెలియజేసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20 తో ముగుస్తుంది. ఈ క్రమంలో విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పటు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , బాలకృష్ణ లు హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రావడం లేదని తెలుస్తుంది. ఇతర కార్య క్రమాలు ఉండడం తో పవన్ రావడానికి కుదరడం లేదట. ఈ విషయాన్నీ ఇప్పటికే టీడీపీ నేతలకు సూచించారు. టీడీపీ – జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారట.ఇదిలా ఉంటె యువగళం ముగింపు సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరాబోతున్నారు. దాదాపు, 5 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో 7 ప్రత్యేక రైళ్లతో పాటు అదనపు బస్సులు ఏర్పటు చేస్తున్నారు. ఇక ఈరోజు లోకేష్ యువగళం పాదయాత్ర 224వ రోజు (శనివారం) ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా లోకేశ్, అరబుపాలెం బీసీ నాయకులు, అనకాపల్లి బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో సమావేశమయ్యారు.

Spread the love