తలనొప్పుల రకాలు.. రెండు వందలకు పైనే!

HEALTH Star Maa News

ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఏదో ఒక టైంలో ఎదుర్కొనే సమస్య తలనొప్పి. అయితే, తలనొప్పి అన్నిసార్లు ఒకేలా ఉండదు. పైకి అన్నీ ఒకేలా అనిపించినా.. తలనొప్పుల్లో సుమారు 200కు పైగా రకాలు ఉన్నాయట. దీనికి చికిత్స తీసుకోవాలంటే మొదట తలనొప్పి రకాలను గుర్తించాలి. అవేవో చూద్దాం.

మైగ్రేన్ తలనొప్పి : తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో నొప్పి వస్తే అది మైగ్రేన్‌ నొప్పి. కొంతమందికి తలనొప్పితో పాటు వాంతులు, వికారం కూడా ఉంటాయి. యాంగ్జైటీ, ఒత్తిడి, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, తగినంత నిద్రలేకపోవడం, ఆల్కహాల్‌ తీసుకోవడం వంటి కారణాల వల్ల మైగ్రేన్ రావొచ్చు. దీనికి కచ్చితంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిందే.

క్లస్టర్ హెడేక్ : ఒక కన్ను లేదా కనుగుడ్డు చుట్టూ నొప్పి వస్తే అది క్లస్టర్ హెడేక్. ఈ నొప్పి వచ్చినప్పుడు కన్ను ఎర్రబడి వాపు వస్తుంది. కంటి నుంచి నీరు కారటం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. తలలో కొన్ని అబ్‌నార్మల్ కండిషన్స్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

సైనస్ హెడేక్ : ముక్కు పైన, నుదిటి దగ్గర లేదా కళ్ల మధ్య నొప్పిగా ఉంటే అది సైనస్ తలనొప్పే. ఈ తలనొప్పి వచ్చినప్పుడు కళ్లు, బుగ్గలు నొప్పెడతాయి. కొంత మందిలో పంటి నొప్పి కూడా ఉంటుంది. ముక్కు దగ్గర ఏవైనా ఇన్ఫెక్షన్లు, ట్యూమర్, అలర్జీలు ఉంటే ఈ తలనొప్పి రావొచ్చు. దీనికి కచ్చితంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

స్ట్రెస్ హెడేక్ : శరీరం, మెదడు అలసిపోయినప్పుడు ఈ తలనొప్పి వస్తుంది. ఇది ఎక్కువగా నుదిటి దగ్గర లేదా చెవి మధ్యలో లోపలికి వస్తుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు శరీరానికి, మెదడుకు రెస్ట్ ఇవ్వాలి. ఇలాంటప్పుడు లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఈ నొప్పి వచ్చినప్పుడు నీళ్లు తాగి, రెస్ట్ తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్‌‌ను సంప్రదించాలి.

Spread the love