సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో జీవనశైలి గాడి తప్పిందనే చెప్పాలి. దీంతో రోజు రోజుకూ ఉబకాయులు పెరిగిపోతున్నారు. అయితే, వెయిట్ లాస్ కోసం జపనీస్ ఫాలో అవుతోన్న డైట్ ‘ఆసా బనానా డైట్’. దీన్నే ‘జపనీస్ మార్నింగ్ బనానా డైట్’ అంటారు. దీంతో బరువు తగ్గడమే కాదు, పూర్తి ఆరోగ్యంగా కూడా ఉంటారట.
జపనీస్ ఫిట్‌నెస్ సీక్రేట్ ఇదే..
- ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద అరటిపండు తిన్నాక లంచ్ వరకూ మరేదీ తినకూడదు. జ్యూస్ వంటివి తాగొచ్చు.డిన్నర్ రాత్రి 7 గంటల్లోపు చేసేయాలి. లంచ్, డిన్నర్ చేసేటప్పుడు కడుపు 70% నిండగానే ఆపేయాలి.అరటి పండుని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసకుంటే.. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. దీంతో శరీరం తేలికవ్వడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.అరటి పండులో శరీరానికి కావల్సిన పొటాషియం, ఫైబర్.. వంటి పోషకాలు కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని కంట్రోల్ చేస్తుంది.