చర్మాన్ని మెరిపించే.. యాక్టివేటెడ్ చార్‌కోల్

HEALTH Star Maa News

ఇప్పుడు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ స్పెషల్‌ ఇంగ్రీడియంట్‌ అయిపోయింది. వీటిలో వాడేవి సహజంగా లభిస్తాయని, ఈ ప్రోడక్ట్‌తో అద్భుత ప్రయోజనాలు పొందొచ్చని కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌‌ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? చర్మ సంరక్షణకు ఇది ఎలా తోడ్పడుతుందనేది తెలుసుకుందాంరండి.

  • యాక్టివేటెడ్ చార్‌కోల్ చర్మం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపి, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
  • ఇది ఓపెన్ పోర్స్‌ను అన్‌లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది.
  • మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్నాన్ని నయం చేస్తుంది.
  • యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ ఉన్న ఫేస్‌మాస్క్, ఫేస్‌వాష్ సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్‌ చేస్తుంది. మీరు వేసుకునే ప్యాక్స్‌లో యాక్టివేటెడ్‌ చార్‌కోల్ మిక్స్‌ చేసుకోవచ్చు.
Spread the love